TG | గ్రామాభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలి

TG | గ్రామాభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలి
TG | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన నూతన పాలకవర్గం సభ్యులు గ్రామ అభివృద్ధికి పాటుపడాలని ఊట్కూర్ ఎంపీడీవో కిషోర్ కుమార్ అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ ఎంపీడీవో కార్యాలయంలో లక్ష్మీ పల్లి సర్పంచ్ రేణుక అంజప్ప ఎంపీడీవో కార్యాలయ సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల మధ్య ఉండి సర్పంచ్ ప్రజా సంక్షేమానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడాలన్నారు. గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు పరిష్కరిస్తూ ప్రజా సేవలో ఉండి వారి సాధక బాధకాలు తెలుసుకొని పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పురోగతి సాధించాలన్నారు. అనంతరం గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు సర్పంచ్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీవో లక్ష్మిరెడ్డి, సిబ్బంది జగదీష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
