TG | ప్రజలకు త్రాగునీరు అందించడమే లక్ష్యం…

TG | ప్రజలకు త్రాగునీరు అందించడమే లక్ష్యం…

TG | దండేపల్లి, ఆంధ్రప్రభ : ప్రజలకు త్రాగు నీరు అందించడమే లక్ష్యమని దండేపల్లి మండలంలోని తాల్లపేట సర్పంచ్ కుర్సెంగా కళావతి అన్నారు,బుధవారం గ్రామంలో ఉన్న మీషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ,పైప్ లైన్ లు సరిగ్గా ఉన్నాయా లేదా అని ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు, రానున్న వేసవికాలం దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మంచినీటిని అందించాలనే సంకల్పంతో మంచినీటి సరఫరా కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు.

ఈ సందర్భంగా గ్రామంలో బోర్వెల్ తో పాటు, ప్రతి వాడకు వెళ్లే పైప్ లైన్ లను, గెట్ వాళ్ళను చెక్ చేశారు, అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ… వేసవికాలంలో ప్రతి ఒక్కరికి మంచినీటిని అందించాలనే ఉద్దేశ్యంతో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించమన్నారు, స్పెషల్ డ్రైవ్ లో వాటర్ ట్యాంక్ ల నిర్వహణ, పైపులైన్ల లీకేజీలు బోరువెల్స్ నిర్వహణ గురించి చర్చించమన్నారు. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ పుట్టపాక తిరుపతి, ఆర్ డబ్ల్యు ఏఈ అస్మిత, పంచాయతీ కార్యదర్శి సత్తయ్య, వార్డు సభ్యులు, ముత్తె కుమారస్వామి, కుడిమేత సుంగు, నాయకులు మాడ దయాకర్, జహీర్ వాటర్ లైనుమెన్ సాబిర్ పాల్గొన్నారు.

Leave a Reply