TG | నిర్మల్ జిల్లా 3 మున్సిపాలిటీలో కొనసాగుతున్న పోలింగ్

TG | నిర్మల్ జిల్లా 3 మున్సిపాలిటీలో కొనసాగుతున్న పోలింగ్
18.29 శాతం పోలింగ్
TG | నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో బుధవారం బైంసా, ఖానాపూర్. నిర్మల్ లో కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియ ఉదయం 11 గంటల వరకు 18.29 శాతం పోలింగ్ నమోదయింది. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఆశించిన స్థాయిలో జరగలేదు 11 గంటల తర్వాత ఒక్కసారిగా ఓటర్లు పోలింగ్ బూత్ల వద్దకు రావడంతో ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు ఉన్నట్టు కనపడుతున్నాయి . ఉదయం 11 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా కేవలం 18.29 శాతం (30,540 ఓట్లు) పోలింగ్ నమోదైంది. ఇందులో ఖానాపూర్ మున్సిపాలిటీ 23.65 శాతంతో ముందంజలో ఉండగా, భైంసాలో 21.34 శాతం నమోదైంది. అయితే జిల్లా కేంద్రమైన నిర్మల్లో మాత్రం ఓటర్లు బయటకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. అక్కడ అత్యల్పంగా 15.73 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడం జరిగింది. జిల్లావ్యాప్తంగా ఖానాపూర్.నిర్మల్. బైంసా. మూడు మున్సిపాలిటీల్లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల నేతృత్వంలో భారీ కట్టుదిద్ధమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
