TG | మాతా రమాబాయి అంబేద్కర్ జీవితం స్పూర్తిదాయకం

TG | మాతా రమాబాయి అంబేద్కర్ జీవితం స్పూర్తిదాయకం
ఎ.ఐ.పి.ఎస్.యు నిర్మల్ జిల్లా అధ్యక్షుడు గడిపాల పరమేష్
TG | ముధోల్, ఫిబ్రవరి 7, ఆంధ్రప్రభ: మాతా రమాబాయి అంబేద్కర్ జీవితం స్పూర్తిదాయకమని ఎ.ఐ.పి.ఎస్.యు నిర్మల్ జిల్లా అధ్యక్షుడు గడిపాల పరమేష్ పేర్కొన్నారు.నిర్మల్ జిల్లా ముధోల్ మండలం తరోడా గ్రామంలో శనివారం ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో మాతా రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన మాతా రమాబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ స్టూడెంట్ యూనియన్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు గడిపాల పరమేష్ మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప శక్తిగా ఎదగడం వెనుక మాతా రమాబాయి చేసిన త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. కటిక పేదరికాన్ని అనుభవిస్తూ, బిడ్డల మరణాన్ని దిగమింగుకుని కూడా భర్తను ఉన్నత చదువుల వైపు, సమాజ పోరాటం వైపు నడిపించిన ధీరవనిత ఆమె అని గుర్తుచేశారు. నేటి మహిళా సమాజానికి, ముఖ్యంగా విద్యార్థి లోకానికి రమాయి జీవితం ఒక గొప్ప స్ఫూర్తి అని, ఆమె ఆత్మస్థైర్యాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గడపాలి శ్రీధర్ టోక్రే నితిన్ లంబాడి రాజారామ్ మనోజ్ ప్రసాద్, నాయకులు, తరోడా గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.
