TG | సర్పంచ్‌గా గెలిచిన రెండు నెలలలోనే అభివృద్ధికి శ్రీకారం

TG | సర్పంచ్‌గా గెలిచిన రెండు నెలలలోనే అభివృద్ధికి శ్రీకారం

రాష్ట్రంలోనే నెంబర్ వన్ గ్రామంగా తీర్చిదిద్దుతా.
గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యo
ఎమ్మెల్యే సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా.
గ్రామ సర్పంచ్ రాపోలు యాదగిరి.

TG | మర్రిగూడ, ఆంధ్రప్రభ : సర్పంచ్‌గా గెలిచిన రెండు నెలల వ్యవధిలోనే శివన్నగూడ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక సర్పంచ్ రాపోలు యాదగిరి శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో శివన్నగూడ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెస్తానని, గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గ్రామంలో ఇక ఎక్కడా మట్టి రోడ్లు కనిపించకుండా సీసీ రోడ్ల నిర్మాణం పనులు చేపట్టామని తెలిపారు. అలాగే డ్రైనేజ్ సమస్య పూర్తిగా లేకుండా శాశ్వత పరిష్కారానికి నిర్మాణం పనులు చేపట్టి, గ్రామములో పారిశుధ్యం సమస్యలు లేకుండా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు.

విద్యార్థుల చదువు, పేదల వైద్యం విషయంలో తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేలల ఉంటాయని తెలియజేశారు. గ్రామంలో చేపట్టిన సీసీ రోడ్లు, మౌలిక వసతులు, పారిశుధ్య పనులు పూర్తిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని, ప్రతి అభివృద్ధి పని పారదర్శకంగా, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అమలు చేస్తున్నామని వివరించారు. ప్రజల ఆశీర్వాదంతో, నిజాయితీతో కూడిన పాలన ద్వారా శివన్నగూడ గ్రామాన్ని అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ గ్రామంగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ రాపోలు యాదగిరి గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.

Leave a Reply