
TG | అంబేద్కర్ రమాబాయి లకు నివాళులర్పిస్తున్న సర్పంచ్ నాయకులు
TG | అంబేద్కర్ రమాబాయి లకు నివాళులర్పిస్తున్న సర్పంచ్ నాయకులు
అంబేద్కర్ సతీమణి రమాబాయి జయంతి వేడుకలు
TG | జైనూర్, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి రమాబాయి జయంతి వేడుకలను శనివారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకల్లో జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్, ఉప సర్పంచ్ డోంగ్రే ప్రకాష్, దళిత సంఘాల నాయకులు పాల్గొని రమాబాయి చిత్రపటానికి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రకాష్ మాట్లాడుతూ అంబేద్కర్ పుణ్యంతోనే రిజర్వేషన్లు వచ్చాయని వారి సేవలు భావితరాలకు తెలిసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మాంగ్ సమాజ్ కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు అమ్మ వాళ్ళ దత్త వార్డు సభ్యులు షేక్ రహీం, అంబేద్కర్ మెమోరియల్ అధ్యక్షులు కాంబ్లే బాబాసాహెబ్, నాయకులు సోన్ కాంబ్లే జనార్ధన్, అన్నారావు, సతీష్ సిద్ధార్థ (సిద్దు) జాదవ్ ధరమ్ సింగ్, జనార్దన్, వెంకటేష్, బాబాసాహెబ్, తదితరులు పాల్గొన్నారు.
