TG | అవకాశం వచ్చింది.. అభివృద్ధి చేసుకుందాం

TG | అవకాశం వచ్చింది.. అభివృద్ధి చేసుకుందాం
TG | భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : భూపాలపల్లి మున్సిపాలిటీలోని 11వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురజాల రవి సోమవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రజల సమస్యలను తెలుసు కున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి ఓ అవకాశం ఇస్తే వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం వల్ల మౌలిక సదుపాయాలు క్షీణించాయని విమర్శించారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు వంటి సమస్యలు సంవత్సరాలుగా పరిష్కారం కాలేదన్నారు. తాను గెలిస్తే మొదటి ప్రాధాన్యతగా ఈ సమస్యలను పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా పనిచేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పాలనలోనే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు.
