TG | కారణాలు చెప్పొద్దు.. అభ్యర్థులను గెలిపించుకరండి

TG | కారణాలు చెప్పొద్దు.. అభ్యర్థులను గెలిపించుకరండి

  • 38 వార్డుల్లో హస్తం జెండా ఎగరాలి
  • అభివృద్ధి బాధ్యత నాది: కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దిశా నిర్దేశం

TG | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : “నాకు కారణాలు చెప్పొద్దు.. సంగారెడ్డి పట్టణంలోని 38 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని రండి. వార్డుల అభివృద్ధి బాధ్యత అంతా నేనే చూసుకుంటాను” అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తనను కలిసేందుకు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థులు, స్థానిక నాయకులు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. 38 వార్డుల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని, అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి అన్ని వార్డుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం పూర్తి చేయిస్తానని తెలిపారు.

రామ్‌నగర్ వార్డు అభ్యర్థిగా శ్రీకాంత్ గౌడ్

రామ్‌నగర్ వార్డు అభ్యర్థి శ్రీకాంత్ గౌడ్ గెలుపునకు పూర్తి సహకారం అందిస్తామని, శివుడికి కో–ఆప్షన్ సభ్యుడిగా అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. ఐదేళ్ల తర్వాత సిద్దు రామ్‌నగర్ అభ్యర్థిగా ఉంటారని, ఇది తుది నిర్ణయమని స్పష్టం చేశారు. అలాగే 5వ వార్డుకు చెందిన అమెర్ బేగ్‌కు కో–ఆప్షన్ సభ్యుడిగా అవకాశం ఇస్తామని, ఆ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకొని రావాలని ఆయన సూచించారు. తమ వార్డుల్లోని అభ్యర్థులతో పాటు ఇతర వార్డుల్లో పరిచయం ఉన్న వారిని కూడా గెలిపించేలా ప్రచారం చేయాలని కార్యకర్తలకు ఆదేశించారు..“ఎన్నికల తర్వాత కారణాలు చెప్పొద్దు.. అభ్యర్థులను గెలిపించుకొని రావడమే మీ బాధ్యత” అని మరోసారి స్పష్టం చేస్తూ, 38 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఉదయం నుంచి రాత్రి వరకు సంగారెడ్డిలోని రామ్‌నగర్ నివాసానికి వివిధ కాలనీలకు చెందిన ప్రజలు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి జగ్గారెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంగారెడ్డి పట్టణంలోని అన్ని 38 వార్డులను సమగ్రంగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.

Leave a Reply