TG | బెల్లంపల్లిలో అభ్యర్థుల ఖరారు

TG | బెల్లంపల్లిలో అభ్యర్థుల ఖరారు
34 వార్డుల తుది జాబితా ఇదే!
సుదీర్ఘ ఉత్కంఠకు తెర..
బరిలో నిలిచే ‘గెలుపు గుర్రాలకు టికెట్లు
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద కోలాహలం.. ప్రచార పర్వానికి సిద్ధమైన అభ్యర్థులు
TG | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల యుద్ధానికి అధికార కాంగ్రెస్ పార్టీ సర్వం సిద్ధమైంది. గత కొద్ది రోజులుగా టికెట్ల కేటాయింపుపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ, ఎమ్మెల్యే గడ్డం వినోద్ 34 వార్డుల అభ్యర్థుల తుది జాబితాను అధికారికంగా ఖరారు చేశారు. సామాజిక సమీకరణాలు, గెలుపు అవకాశాలే ప్రాతిపదికగా ఈ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. వార్డుల వారీగా ఖరారైన అభ్యర్థులు వీరే బెల్లంపల్లి పట్టణంలోని 1 నుండి 34 వార్డులకు గాను అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే.. 1వ వార్డు నుండి మాదరి లక్ష్మి, 2లో గోమాస ప్రవీణ్ కుమార్, 3లో పొరండ్ల సత్యవతి, 4లో పంగ శాంత, 5లో పేరాపల్లి పరమేష్‌లకు అవకాశం దక్కింది. అలాగే 6వ వార్డులో దుబాసి వెంకటస్వామి, 7లో దావ స్వాతి, 8లో ఎండి. నిజాముద్దీన్, 9లో రొడ్డ శారద, 10లో డీకొండ పద్మ బరిలో నిలిచారు.
అంతేకాకుండా 11వ వార్డు నుండి గాలి సుమలతను అభ్యర్థిగా ప్రకటించగా, 12లో జరుపుల లక్ష్మి, 13లో బండి ఉమ, 14లో ముక్కెర సోమశేఖర్, 15లో చింతల వసంతలు టికెట్ దక్కించుకున్నారు. 16వ వార్డులో రేగుంట రమాదేవి, 17లో రాగం శెట్టి సత్యనారాయణ, 18లో తస్లీమ్ సుల్తానా, 19లో కాంపెల్లి దయమణి, 20లో మత్తమారి సరస్వతి, 21లో ఎలుక ఆకాష్‌లు పోటీ చేయనున్నారు. వీరితో పాటు 22వ వార్డు నుండి ఆకుల లలిత, 23లో జంగం కల్పన, 24లో దామెర విజయలత, 25లో కంకటి ప్రణీత, 26లో ఇప్ప కుమారస్వామి, 27లో బేతి శ్రావణ్ కుమార్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చివరగా 28లో చిప్ప అర్చన, 29లో మేడి పున్నం చంద్, 30లో గెల్లి విజయలక్ష్మి, 31లో గెల్లి సంధ్య, 32లో నీలి హారిక, 33లో బండి రజిత మరియు 34వ వార్డు నుండి గడ్డం కవితలు కాంగ్రెస్ తరపున బరిలో నిలవనున్నారు.
ప్రచార పర్వానికి అభ్యర్థుల సై..
కాంగ్రెస్ నుంచి టికెట్లు ఖరారు కావడంతో అభ్యర్థులంతా తమ తమ వార్డుల్లో ప్రచారానికి సమాయత్తమవుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఇక క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. టికెట్ దక్కని వారిని బుజ్జగించే బాధ్యతను పార్టీ ముఖ్య నేతలు తీసుకున్నారు.
