
TG | మీ బిడ్డగా ఆశీర్వదించండి.. మీకు తోడుగా ఉంటాను…
TG | మీ బిడ్డగా ఆశీర్వదించండి.. మీకు తోడుగా ఉంటాను…
- వార్డ్ లో పెంకుటిల్లు లేకుండా చేయడమే నా ప్రధాన లక్ష్యం
- పక్కా ఇళ్లు, డ్రైనేజీ, సీసీ రోడ్లు ప్రాధాన్యం ఇస్తాను
- కడియం శ్రీహరి ఆశీస్సులతో అభివృద్ధి పనులు చేస్తాను.
- మిషన్ భగీరథ నీటి సరఫరా, పింఛన్లు, రేషన్ కార్డుల మంజూరుకు కృషి
- వార్డు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతా
- కుల సంఘాలకు ఎల్లవేళలా అండగా నిలుస్తాను.
- ఉత్తమ వార్డు నిర్మాణం కోసం నిజాయితీగా కృషి చేస్తాను.
- ఒక అవకాశం ఇవ్వండి..మీకు తోడుగా ఉంటాను
- 18వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పొన్న రవి
TG | స్టేషన్‌ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ నుంచి 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పొన్న రవి పోటీ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలతో మమేకమై ఉంటూ, తాగు నీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యలపై లోతైన అవగాహన కలిగిన నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. సమస్య ఎక్కడ ఉందో చెప్పాల్సిన అవసరం లేకుండా, ప్రజల కష్టాలను ముందే తెలుసుకుని స్పందించే నేతగా పొన్న రవికి పేరుంది. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, అనుభవంతో కూడిన రాజకీయ దృష్టి, సేవాభావంతో కూడిన నాయకత్వం ఆయన ప్రత్యేక తగా నిలుస్తుందని స్థానికులు చెబుతున్నారు. గత 25ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న రవి కుటుంబం ఎన్నో ఏళ్లుగా రాజకీయ అనుభవం కలిగి ఉందని చెబుతున్నారు.
- సేవనే లక్ష్యంగా..ప్రజలను ఆప్యాయంగా పలికే నేతగా :
ప్రజలు పిలిస్తే ఆప్యాయంగా పలికే నేతగా, ప్రతి ఒక్కరి మాట వినే వ్యక్తిగా పొన్న రవి ఇప్పటికే ప్రజల మధ్య మంచి గుర్తింపు సంపాదిం చుకున్నారు. కష్టపడే మనిషిగా.. సేవనే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 18వ వార్డులో ఆశాజనకమైన నాయకుడిగా ప్రజల ముందుకు వస్తున్నారు.
- కడియం శ్రీహరి ఆశీస్సులతో అభివృద్ధి పనులు చేస్తా:
మున్సిపాలిటీలోని 18వార్డ్ లో మంగళవారం స్థానిక నాయకులతో కలిసి పొన్న రవి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..వార్డులో గెలిచిన వెంటనే పెంకుటిల్లులు లేకుం డా ప్రతి పేదవాడికి పక్కా ఇళ్లు ఇప్పించడమే తన లక్ష్యమని తెలిపారు. కడియం శ్రీహరి ఆశీస్సులతో గతంలో ఎన్నడూ లేని విధంగా అర్హులైన పేదలకు అన్ని సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. అలాగే కుల సంఘాలకు అవసరమైన చోట భవనాల ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, సీసీ రోడ్ల మరమ్మత్తులు, వార్డులో కనీసం 50 పక్కా ఇళ్ల మంజూరు, అర్హులైన వారికి పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు, మిషన్ భగీరథ నీటి సరఫరా వంటి అభివృద్ధి పనులను ప్రాధాన్యంగా చేపడతానని తెలిపారు. యువత కోసం ప్రోత్సాహం అందిస్తాను. ఎమ్మెల్యే, ఎంపీ ఆశీస్సులతో వార్డుకు మరిన్ని అభివృద్ధి పనులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా వెల్లడించారు.
