TG | ఘనంగా సంగాల ప్రేమ్ జయంతి

TG | ఘనంగా సంగాల ప్రేమ్ జయంతి

  • లార్డ్ వృద్ధాశ్రమంలో అన్నదానం

TG | భీమారం, ఆంధ్ర‌ప్ర‌భ : గ్రేటర్ పరిధిలోని 55 డివిజన్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు (దివంగత) సంగాల ప్రేమ్ కుమార్ జన్మదిన వేడుకలు పెండ్యాల వీనస్ ఆధ్వర్యంలో భీమారం ఇందిరాగాంధీ విగ్రహం వద్ద( పార్టీ లకు అతీతంగా) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటశ్వర్లు హాజరై ప్రేమ్ కుమార్ జన్మదిన కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు భీమారం వాసులతో కలిసి స్వీట్లు, పండ్లు పంపిణి చేశారు. అనంతరం కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో భీమారం – పలి వేల్పుల రోడ్డులో గల లార్డు వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు బుర సారంగపాణి, మచ్చా వెంకటస్వామి,భీమారం కాంగ్రెస్ అధ్యక్షులు డైని,డివిజన్ కాంగ్రెస్ నాయకులు సంగాల పరమేష్, సంగాల చిట్టిబాబు, పరిశుద్ధాత్మ దేవాలయ ఫాదర్లు, ప్రెసిడెంట్ సంగాల రవి,పంతులు సంగాల బాబు, రేణికుంట్ల సురేష్, నమిండ్ల అరుణ్,మాదిగ కుల సంఘ అధ్యక్షులు సంగాల కోటేశ్వర్, కొండపలకల భాస్కర్,బొక్క కిరణ్, సంగాల వీనస్, ఇమ్మడి కొమరయ్య, ఆటో యూనియన్ అధ్యక్షులు కావటి సంపత్, తోట రమేష్, సంగాల రాజేష్,సంగాల అనురూప్, కిషోర్, ల తో పాటు హాసన్ పర్తి మీడియా పాయింట్ అధ్యక్షుడు జక్కుల విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply