TG | తొలి జాబితా రిలీజ్!

TG | తొలి జాబితా రిలీజ్!
TG | మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ : మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఈ మేరకు ఈ రోజు కార్పొరేటర్ అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ విడుదల చేసింది. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్.వినోద్ కుమార్‌తో పాటు సీనియర్ నేతలతో కూడిన కమిటీ ఈ జాబితాను ప్రకటించింది. కమిటీ ఆధ్వర్యంలో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిపారు. జిల్లా ఇన్‌చార్జీ మంత్రి దామోదరం రాజనర్సింహ ఆమోదంతోనే తొలి జాబితాను విడుదల చేసినట్లు వెల్లడించారు. సర్వే రిపోర్టులను ప్రామాణికంగా తీసుకుని గెలుపు సాధించే అవకాశాలు ఉన్న అభ్యర్థులకే టికెట్లు కేటాయించినట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
