TG | అపూర్వం … ఆత్మీయం …

TG | అపూర్వం … ఆత్మీయం …

TG | బచ్చన్నపేట, ఆంధ్రప్రభ : బచ్చన్నపేట మండలంలోని కట్కూరు ఉన్నత పాఠశాలలో 2001- 02 పదో తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఈ రోజు మండల కేంద్రంలోని ఎస్ వీ గార్డెన్ లో జరిగింది. ఇట్టి భ్యాచ్ పూర్వ విద్యార్థులు ప్రస్తుతం ఎక్కడెక్కడో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డ సుమారు 50 మంది పూర్వ విద్యార్థులు దాదాపు 24 ఏళ్ల తర్వాత చదివిన పాఠశాలలోనే కలుసుకుని చిన్ననాటి బాల్యస్మృతులు గుర్తు చేసుకున్నారు. ఆత్మీయ ఆలింగనాలు.. పలకరింపులతో సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు. ఆనాటి గురువులు సరస్వతి, రాములు, బాల నరసయ్య, బాల్ రెడ్డి, నరసయ్య లకు పాద పూజ చేసి సన్మానించారు. ఈ అపురుప క్షణాలను సెల్‌ఫోన్ లలో బంధించారు. అనంతరం ఆత్మీయ విందు ఆరగించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహకులు పూర్వ విద్యార్థు లు ఇజ్జగిరి రాజు, మానేపల్లి సుధీర్, జింగిలి సాయిబాబా, ప్రవీణ్, పద్మ, అనిల్ చంద్ర, సందీప్, 50 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply