TG | భారీ చోరీ…

TG | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో భారీ చోరీ జరిగింది. జిల్లాలోని శామీర్ పేట పరిధిలో గల బొమ్రాస్ పేటలో ఓఇంటి తాళాలు పగులగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. 20తులాల బంగారం, వెండి, రూ.2లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
