TG | ఊట్కూర్ ముంపు గ్రామంగా ప్రకటించాలి….

TG | ఊట్కూర్ ముంపు గ్రామంగా ప్రకటించాలి….

TG | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా, మక్తల్- నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో చేపడుతున్న పనుల వల్ల ఊట్కూర్ మండల ముంపుకు గురవుతుందని గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని నీటిపారుదల ఎస్ ఈ శ్రీధర్ కు ఉపసర్పంచ్ రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులుఎం. భరత్, వార్డు సభ్యుడు నరేష్ తో పాటు పలువు నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఊట్కూర్ పెద్ద చెరువు లో నీటి నిలువ ఉండడంతో గ్రామంలోని పలు కాలనీలలో నూతనంగా ఇండ్లు నిర్మించేందుకు పునాదులు తవ్వితే ఊట నీరు వస్తున్నాయని రిజర్వాయర్ గా మారిస్తే ఊట్కూర్ గ్రామం ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పెద్ద చెరువు రిజర్వాయర్ గా మారుస్తుండడంతో అధికారులు డీపీఆర్ ఇవ్వడంతో పాటు ప్రాజెక్టు కింద చెరువు నిల్వ కొత్త కట్ట నిర్మాణం సామర్థ్యం పెంపుతో రానున్న రోజుల్లో ముంపు ప్రమాదం పెరిగే అవకాశం ఉందని వెంటనే ఊట్కూర్ ను ముంపు గ్రామంగా ప్రకటించి ప్రజలు రైతులను ఆదుకోవాలని కోరారు. ఎత్తిపోతల పథకం పనులు చేపట్టకముందే ప్రజలకు రైతులకు డి పి ఆర్ వివరించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ హన్మంతు,బీఆర్ఎస్ నాయకుడు కోరం శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply