TEACHERS | టెట్ అర్హత పరీక్ష
TEACHERS | కడెం ఆంధ్రప్రభ : ప్రభుత్వం ఉపాధ్యాయుల అర్హత పరీక్ష పెట్టకంటే ముందే 2010 కంటే మునుపే డీఎస్సీలో ఉద్యోగం సంపాదించిన సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేష్ నాయక్ (Bhukya Rajesh Nayak) అన్నారు, ఈ మేరకు సంఘ తీర్మానం కాపీని తెలంగాణ రాష్ట్రం విద్యా శాఖ మంత్రి ముఖ్యమంత్రి కి ఫ్యాక్స్ ద్వారా సీఎంఓ కు కాపీ పంపినట్లు ఆయన తెలియజేశారు.
సోమవారం మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మరియు యన్ సి టి ఈ విషయంపై పునరాలోచన చేయాలని అప్పటి నిబంధనాల ప్రకారమే ఉపాధ్యాయుల యొక్క నియామకం జరిగిందని ప్రభుత్వాలు ఉపాధ్యా నియమకమైన తర్వాత ఇలాంటి షరతులు పెట్టడం రాజ్యాంగానికి విరుద్ధమని అన్నారు ఈ విషయంలో గతంలో ఉన్న గవర్నమెంట్ (Government) ఆర్డర్లు జి.ఓ. ప్రకారం ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
అదేవిధంగా జిల్లాలో పర్యవేక్షణ కమిటీల ఏర్పాటు వెంటనే చేయాలని పర్యవేక్షణ చేస్తున్న ఉపాధ్యాయుల స్థానంలో విద్యా వాలంటీర్లను నియమించాలని ప్రతి పాఠశాలలకు పానెల్ బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ (Kranthi Kumar) నాయకులు శ్రీహరి నిక్షిత తదితరులు పాల్గొన్నారు

