Terrorizers 111 : ఢిల్లీ బిక్కు బిక్కు Andhra prabha Detail Report

Terrorizers 111 : ఢిల్లీ బిక్కు బిక్కు Andhra prabha Detail Report
టెర్రరైజర్స్ అలజడి
10 స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్
రంగంలోకి పోలీసులు
విస్తృత తనిఖీలు
‘హోక్స్ కాల్స్ గా నిర్ధారణ
( ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ )
ఒక వైపు ఇంకా చలి తీవ్రత తగ్గలేదు. అయినా ఆదివారం సరదాగా గడిపిన డిల్లీ ప్రజలకు టెర్రరైజర్స్ సోమవారం ఉదయం చెమటలు పట్టించారు. ఎయిర్ ఫోర్స్ ఆధీనంలోని స్కూలు సహా.. 10 ప్రముఖ పాఠశాలల యాజమాన్యాల గుండెల్లో దడ పుట్టించారు. యావత్తు పోలీసు వ్యవస్థను ఉరుకులు పరుగులు పెట్టించారు. ఐతే.. ఇవన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనని పోలీసులు తేల్చి చెప్పారు.

కానీ దాదాపు 4 గంటల పాటు ఢిల్లీ ప్రజానీకాన్ని ఈ హాక్స్ కాల్స్ కంగారు పెట్టేశాయి. కకావికలం చేశాయి. ఈ బెదిరింపుల వెనుక అసలు కథ తెల్సుకుందాం. ఢిల్లీలోని ప్రధానంగా దక్షిణాది , వాయువ్య ఢిల్లీలోని దాదాపు 10 ప్రముఖ పాఠశాలలకు సోమవారం ఉదయం 8:30 నుంచి 9:00 గంటల మధ్య బెదిరింపు ఈమెయిళ్లు అందాయి.
Terrorizers 111 : అదే అలజడి
ఢిల్లీ కాంట్ లోని లోరెటో కాన్వెంట్ స్కూల్ (Loreto Convent School), సాదిక్ నగర్ లోని – ది ఇండియన్ స్కూల్ (The Indian School), శ్రీనివాసపురి లోని – కేంబ్రిడ్జ్ స్కూల్ (Cambridge School) – న్యూ ఫ్రెండ్స్ కాలనీ బ్రాంచ్లు, రోహిణి ప్రాంతంలోని బాల్ భారతి పబ్లిక్ స్కూల్ (Bal Bharati Public School) – వెంకటేశ్వర స్కూల్ (Venkateshwar School) – , సిఎమ్ స్కూల్ (CM School) – , డిటిఏ స్కూల్ (DTA School), లోధి రోడ్ లోని – ఐఎన్ఏ (INA)ఎయిర్ ఫోర్స్ స్కూల్ (Air Force School), కెఆర్ మంగళం స్కూల్ (KR Mangalam School) ఈ మెయిల్స్ వచ్చాయి. ఈ బెదిరింపు ఈమెయిళ్లు ఉదయం 8:30 నుండి 9:00 గంటల మధ్య పాఠశాల యాజమాన్యాలకు అందాయి.

తక్షణమే యాజమాన్యాలు ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. వెంటనే ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక దళం , బాంబు డిస్పోజల్ స్క్వాడ్లు (BDS) రంగంలోకి దిగాయి. ముందస్తు జాగ్రత్తగా విద్యార్థులను, సిబ్బందిని వెంటనే తరలించి (Evacuation), పాఠశాలలను ఖాళీ చేయించారు. చాలా పాఠశాలలు ముందస్తు జాగ్రత్తగా విద్యార్థులను ఇళ్లకు పంపించేశాయి. మరికొన్ని స్కూళ్లు తల్లిదండ్రులకు ఆందోళన చెందవద్దని మెసేజ్లు పంపాయి.
Terrorizers 111 : ఇవి ‘టెర్రరైజర్స్ 111’ బెదిరింపులు

ఈమెయిల్లో తీవ్ర హెచ్చరికల్ని పోలీసులు గుర్తించారు. “ఢిల్లీ ఖలిస్థాన్గా మారుతుంది” అనే నినాదాలతో పాటు, ఫిబ్రవరి 13 మధ్యాహ్నం 1:11 గంటలకు పార్లమెంటు భవనంపై కూడా దాడి చేస్తామని బెదిరించినట్లు సమాచారం. ఇప్పటివరకు జరిపిన సోదాల్లో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదు. గతంలో కూడా ఇలాంటి బెదిరింపులు (Hoax calls) వచ్చిన నేపథ్యంలో, పోలీసులు వీటిని సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని, అధికారిక సమాచారం కోసం వేచి చూడాలని అధికారులు కోరారు.

ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇవి ‘హోక్స్’ (వదంతులు) అని పోలీసులు భావిస్తున్నారు. సైబర్ నిపుణులు ఈమెయిల్ ఎక్కడి నుండి వచ్చిందో కనిపెట్టే పనిలో ఉన్నారు. ‘టెర్రరైజర్స్ 111’ (Terrorizers 111) అనే గ్రూపు పేరుతో ఈ మెయిల్స్ వచ్చినట్లు అనుమానిస్తున్నారు.

ALSO READ : DHOOM 6 : జస్ట్ 6 నిముషాల్లో దోపిడీ
