ఆలయాల్లో దొంగల బీభత్సం

ఎండపల్లి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో దొంగలు రెచ్చిపోయారు. రాజారాంపల్లి గ్రామంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ, అలాగే గొడిశాలపేటలోని చెన్నకేశవ ఆలయంలో హుండీ దొంగతనం చేశారు. విషయాన్ని ఆలయ కమిటీ సభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. చెన్నకేశవ స్వామి ఆలయంలో దుండగులు హుండీతో పాటు సీసీ కెమెరాను కూడా ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు రెండు ఘటనాస్థలాలకు చేరుకుని విచారణ ప్రారంభించారు.

