రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం

రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం

కృత్తివెన్ను ఎస్ఐ పైడి బాబు

కృత్తివెన్ను – ఆంధ్రప్రభ : వాహనదారులు రహదారి భద్రతా నియమాలను పాటించాలని కృత్తివెన్ను మండల ఎస్సై పైడి బాబు సూచించారు. కృత్తివెన్ను జాతీయ రహదారి, ప్రధాన కూడలిలా వద్ద శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. వాహనాల అతివేగంగా, మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారికి, సరైన పత్రాలు లేని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు పలు వాహనాలకు జరిమానాలు విధించారు.

తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తెలిపారు. బైక్ పై వెళ్లేవారు హెల్మెట్ ధరించకపోవడంతో ఇటీవలే జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృతి చెందారని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply