పదవ తరగతి పరీక్షలు షురూ..

చెన్నూర్, ఆంధ్రప్రభ : నేటి నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. చెన్నూరులో మొత్తం 656 మంది విద్యార్థుల కోసం మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

నేటి నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు ఏప్రిల్ 16వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఉదయం 8:30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి అనే నిబంధన ఉంది. అయితే ఆలస్యంగా వచ్చే విద్యార్థుల కోసం 5 నిమిషాల గ్రేస్ సమయం కూడా ఇవ్వనున్నారు.

పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు చేయడంతో పాటు సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నాయి.

అలాగే పరీక్ష కేంద్రాల్లో సెల్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply