tenth exames| ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..

tenth exames| ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రేప‌టి నుంచి మొదలవనున్నాయి. ఈ పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యార్ధులు ప‌రీక్ష‌లకు సిద్ధ‌మ‌య్యారు. ఇప్పటికే హాల్‌ టికెట్లు కూడా విడదలయ్యాయి. పరీక్ష కేంద్రాలకు విద్యార్ధులు సులువుగా చేరుకునేందుకు హాల్‌టికెట్లపై క్యూఆర్‌ కోడ్‌ను కూడా ముద్రించారు. మొబైల్‌ ఫోన్‌ ద్వారా దీనిని స్కాన్‌ చేస్తే రూట్ మ్యాప్‌ ఆటోమెటిక్‌గా ఓపెన్‌ అవుతుంది. ఈ నేప‌థ్యంలో ప‌రీక్ష రాసే స‌మ‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  • పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడి పెంచుకోవ‌ద్దు.
  • కొద్దిసేపు నడక, తేలికపాటి వ్యాయామం చేయడం వ‌ల్ల మానసిక ఒత్తిడిని త‌గ్గుతోంది.
  • లోతుగా శ్వాస తీసుకునే అలవాటు పెంచుకోవాలి.
  • పరీక్షా కేంద్రానికి కనీసం 30–45 నిమిషాల ముందే చేరుకోవాలి.
  • హాల్ టికెట్, పెన్లు, పెన్సిల్ అవసరమైన వస్తువులు ముందుగానే సిద్ధం చేసుకోవాలి.
  • పరీక్షకు వెళ్లే ముందు తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది.
  • ఎక్కువ కాఫీ లేదా టీ తాగడం తగ్గించాలి. ఇవి శరీరం అలసట చెందకుండా ఉండేందుకు సహాయపడతాయి.
  • ప‌రీక్ష ప్రారంభమైన వెంటనే స‌మాధానాలు రాయడం మొదలు పెట్టొద్దు.
  • ముందుగా ప్రశ్నపత్రాన్ని ఒకసారి నిశితంగా చదవాలి.
  • ఏ ప్రశ్నలు సులభంగా రాయగలమో ముందుగా గుర్తించాలి.
  • బాగా తెలిసిన ప్రశ్నలకు స‌మాధానం రాస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
  • పరీక్షలో ప్ర‌శ్న‌ల‌కు జవాబు ఎక్కువగా రాయడం కంటే స్పష్టంగా, సరిగ్గా రాయడం మంచిది.
  • అడిగిన ప్రశ్నకు మాత్ర‌మే సమాధానం ఇవ్వాలి.
  • పెద్ద పేరాల కంటే పాయింట్ల రూపంలో రాస్తే సులభంగా ఉంటుంది.
  • అవసరమైన చోట చిన్న హెడ్డింగ్స్ పెట్టడం మంచిది.
  • సైన్స్, సోషల్ వంటి విషయాల్లో అవసరమైన చోట బొమ్మలు లేదా మ్యాపులు గీయాలి.
  • పరీక్షలో సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి.
  • మొత్తం పరీక్ష సమయాన్ని ప్రశ్నల సంఖ్యకు అనుగుణంగా విభజించాలి.
  • ఒకే ప్రశ్నపై ఎక్కువ సమయం వృథా చేయకూడదు.
  • ఏదైనా ప్రశ్న వెంటనే గుర్తు రాకపోతే దానికి స్థలం వదిలి తరువాత రాయాలి.
  • చివరి 10–15 నిమిషాలు జవాబులను మరోసారి పరిశీలించుకోవాలి.
  • ఇతర విద్యార్థులతో మార్కుల పోలికలు చేయకూడదు.
  • ప్రతి పరీక్ష ముగిసిన తర్వాత ఆ పరీక్ష గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.
  • తదుపరి పరీక్షపై మాత్రమే దృష్టి పెట్టాలి.
  • పరీక్షల సమయంలో పోషకాహారం తీసుకోవాలి.
  • రోజుకు కనీసం 7–8 గంటలు నిద్రపోవాలి.
  • ఎక్కువగా మొబైల్ లేదా టీవీ చూడకుండా ఉండాలి.

Leave a Reply