పదో తరగతి పరీక్షలు ప్రారంభం

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ ; పదవ తరగతి పరీక్షలు ప్రారంభం భీమ్‌గల్ మండలంలో నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 239 మంది విద్యార్థులు, జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో 230, మంది విద్యార్థులు జెడ్పిహెచ్ఎస్ పల్లికొండ పాఠశాలలో 117,మంది జడ్పిహెచ్ఎస్ ముచ్కూర్ పాఠశాలలో 118,మంది మొత్తం 704,మంది విద్యార్థులకు ఒక్కరు కూడా గైర్హాజరు కాకుండా అందరూ విద్యార్థులు పరీక్ష రాయడానికి మొత్తం హాజరైనారని మండల విద్యాశాఖ అధికారి డి.స్వామి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్ష హలో విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 13 వ తేది వరకు జరగనున్నాయి. ప్రతీ రోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం. 12:30 వరకు పరీక్షల సమయం వుంటుంది. విద్యార్థులు ఉదయం 8:30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలనె నిబంధనలు ఉండగా 5 నిమిషాలు గ్రేస్ సమయాన్ని ఇచ్చారు.
పరీక్ష కేంద్రాలలో ఎలాంటి మాస్ కాఫియింగ్ అవకాశం లేకుండా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు సిట్టింగ్ స్కాడ్ తో పాటు ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.పరీక్ష కేంద్రాల్లో సెల్ఫోన్లు, స్మార్ట్ వాచీల అనుమతి లేదు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల లోపు ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని అధికారులు తెలిపారు.
