ఆల‌య అభివృద్ధి ప‌నులకు టెండ‌ర్లు పూర్తి..

ఆల‌య అభివృద్ధి ప‌నులకు టెండ‌ర్లు పూర్తి..

వేములవాడ, ఆంధ్ర‌ప్ర‌భ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి(Sri Rajarajeshwara Swamy) ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణం పనుల టెండర్ పూర్తయిందని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్(Sailaja Ramayyar) అన్నారు.

ఈ రోజు స్వామివారి సన్నిధిలోని చైర్మన్ చాంబర్లో వివిధ శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి విస్తరణలో భాగంగా భక్తుల దర్శనాలు, కోడె మొక్కులు, ఇతర పూజలు కల్పించే విషయమై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. మరో రెండు వారాల్లో కళ్యాణకట్ట(Kalyanakatta)తో పాటు మిగతా కట్టడాలు, కూల్చివేతలు పూర్తవుతాయని, ఒకవైపు కూల్చివేతలు, మరోవైపు మహా మండపం నిర్మాణం పూర్తి కావాల్సి ఉందన్నారు.

ఆలయ తూర్పు భాగంలో ఎల్ఈడి స్క్రీన్(LED screen) పై స్వామివారి, అమ్మవారి, గణపతి దర్శనం కల్పిస్తామన్నారు. ఆలయంలో స్వామి వారి ఏకాంత సేవల్లో మొక్కుబడి కోసం టికెట్లు(tickets) తీసుకున్న భక్తుల గోత్రనామాలు చదివి పూజలు చేస్తారన్నారు. ఎల్. ఈ.డి స్క్రీన్ లపై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవచ్చన్నారు. భీమేశ్వరాలయంలో సైతం ఆర్జిత సేవలు భక్తులకు అందుబాటులో ఉంటాయని తేల్చి చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Aadi Srinivas)తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply