Temple | నిజాయితీ చాటుకున్న ఆలయ సిబ్బంది..

Temple | నిజాయితీ చాటుకున్న ఆలయ సిబ్బంది..

Temple | బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్ర ప్రభ : బాసర పుణ్యక్షేత్రంలో ప్రకాశం జిల్లాకు చెందిన భక్తులు మర్చిపోయిన పర్సును తిరిగి ఇచ్చి తమకున్న నిజాయితి చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాకు చెందిన మాన్యల శ్రీనివాస్(Manyala Srinivas) దంపతులు అమ్మవారి చెంత ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో తమ కుమారునికి అక్షరాభ్యాసం చేయించారు.

అక్కడ‌ తమ పర్సును మర్చిపోయి రూమ్ కి వెళ్ళిపోయారు. తమ పర్సు ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో మర్చిపోయామని ఆలయ సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో సిబ్బంది సీసీ కెమెరా(CC Camera)లో పరిశీలించారు. మండపంలో మర్చిపోయిన పర్సు అక్కడే ఉండడంతో ప్రకాశం జిల్లా మాన్యాల శ్రీనివాస్ కు పర్సు అందించారు.

పర్సులో ఐదు వేల రూపాయల నగదు ఉందని సిబ్బంది తిరిగి ఇవ్వడంతో భక్తుడు ఆలయ సిబ్బంది నిజాయితీని మెచ్చుకున్నాడు. హోంగార్డ్ ఇంచార్జ్ సురేష్(Home Guard Incharge Suresh), వెన్నెల, సీసీ ఆపరేటర్ సాయిలు ఉన్నారు.

Leave a Reply