Temple | భగవద్గీత పారాయణం…

Temple | భగవద్గీత పారాయణం…

Temple | గట్టుప్పల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ స్వామి దేవాలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు భగవద్గీత పారాయణం నిర్వహించారు.

వేకువ జామునుంచే భక్తులు దేవాలయాని(temple)కి పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలో పాల్గొని భగవద్గీత శ్లోకాలను పఠించారు. ముక్కోటి ఏకాదశి రోజున భగవద్గీత పారాయణం(Bhagavad Gita recitation) చేయడం వల్ల శాంతి నెలకొంటుందన్నారు. పూజారులు భగవంతుని ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.

Leave a Reply