Temple | కూర్మావతారంలో భద్రాద్రి రామయ్య ద‌ర్శ‌నం

Temple | కూర్మావతారంలో భద్రాద్రి రామయ్య ద‌ర్శ‌నం

Temple | భద్రాచలం, ఆంధ్రప్రభ : వైకుంఠ ఏకాదశి ఉత్సవాల‌ భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి(Sri Seetha Ramachandra Swamy) వారి దేవస్థానంలోని స్వామివారు కుర్మా అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భద్రగిరి పై వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభ‌మ‌య్యాయి.

ఈ ఉత్సవాలలో శ్రీ సీతారామచంద్రస్వామి వారు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, కల్కి అవతారాలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తెల్ల‌వారు జామున 4 గంటలకే(4 o’clock) ఆలయాన్ని తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. ఆరాధన, నివేదన అనంతరం వేద పండితులు నాళాయిర దివ్య ప్రబంధాలను పఠించారు.

ఆళ్వార్లకు పరివట్టం కట్టి పూల మాలలు వేసి తులసీ దళాలు సమర్పించారు. అనంతరం కూర్మావతారంలో అలంకరించిన స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చారు. కూర్మావతారంలో ఉన్న స్వామివారికి భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆదివారం కావడంతో రామాలయానికి భక్తులు పోటెత్తారు.

Leave a Reply