Temple | మాలదారులకు అన్నదానం

Temple | మాలదారులకు అన్నదానం

Temple | మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని శ్రీ శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామీ(Sri Sri Hari Haraputra Ayyappa Swamy) దేవాలయం(Temple)లో ఈరోజు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ముచ్చపోతుల శ్రీనివాస్ గీతమ్మ(Muchhapotula Srinivas Geethamma) దంపతులు అయ్యప్ప, హనుమాన్, శివ స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మునుగోడు మాజీ సర్పంచ్ మిర్యాల వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుంభం చెన్నారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జంగిలి నాగరాజు, పందుల నరసింహ, బండారి మల్లేష్,గుంటుక కృష్ణయ్య, గురు స్వాములు పోలే వెంకటేశ్వర్లు, మిరియాల రమా శంకర్, ఆలయ పూజారి శ్రీనివాసాచారి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply