ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య

నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నందికొట్కూరు, ఆంధ్రప్రభ : కొత్తపల్లి మండలం శివపురం గ్రామం నల్లమల్ల ఫారెస్ట్ లో వెలిసినటువంటి శ్రీ శ్రీ శ్రీ సరస్వతి అమ్మవారి టెంపుల్ ను ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి టెంపుల్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని శ్రీశైలం దేవస్థానం వారు దత్తత తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆయన తెలిపారు.

గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ… నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో వెలసిన సరస్వతి అమ్మవారి పుట్టినరోజు వేడుకలు శ్రీశైలం దేవస్థానం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అత్యంత వైభవంగా వేడుకలు జరిగాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పిల్లలకి అక్షరాభ్యాసం అనగానే తెలుగు రాష్ట్రాలలో గుర్తుకు వచ్చేది బాసర అమ్మవారు అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విడిపోయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ఏకైక సరస్వతి కొలనుభారతి అమ్మవారు అని పేర్కొన్నారు. కొలనుభారతి సరస్వతి టెంపుల్ కు బిటి రోడ్డు పర్మిషన్ ఉంది కానీ కాకపోతే బీటీ రోడ్డుకు ఫారెస్ట్ అధికారులు అవరోధం కల్పిస్తున్నారు. అలాగే రెండోది వచ్చేసి గుడికి కావలసిన విద్యుత్ సౌకర్యానికి కూడా ఫారెస్ట్ ఫారెస్ట్ వాళ్లు ఇబ్బందులు పెడుతున్నారు అని తెలిపారు. ఈ సభ ద్వారా కోరుకునేది ఒకటే అధ్యక్ష అక్కడికి ఫారెస్ట్ అధికారులు విచారణ చేసి సరస్వతి అమ్మవారి గుడికి కావలసినటువంటి అభివృద్ధికి సహకరించాలని కోరారు.

అదేవిధంగా పారమంచాల నుంచి భరక సంజరాయుడు వరకు గతంలోనే అనుమతి ఇచ్చిన బీటి రోడ్డుకు ఫారెస్ట్ అధికారులు అభ్యంతరం చెపుతున్నారు కాబట్టి వీటిని ఫారెస్ట్ వాళ్లు మానవత్వ దృక్పథంతో మా నియోజకవర్గంలో ఉన్న గుళ్ళు కు రహదారులకు ఏర్పాటు చేసేందుకు సహకరించవలసిందిగా మంత్రివర్యులు దృష్టికి తీసుకువస్తున్నాను అని తెలిపారు.

Leave a Reply