అమ్మ‌వారి ఉత్సవాలను జయప్రదం చేయాలి..

అమ్మ‌వారి ఉత్సవాలను జయప్రదం చేయాలి..

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : ఏప్రిల్ మూడవ వారంలో జరిగే రేణుక ఎల్లమ్మ తల్లి ఉత్సవాలను వైభవోపేతంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని గౌడ సంఘ నాయకులు తెలిపారు. మండల కేంద్రంలో గౌడ సంఘ కార్యాలయంలో గోడిశాల కుమారస్వామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో గౌడ సంఘ నాయకులు మాట్లాడుతూ… ఇప్పుడున్న 9 మందితో ఉన్న పాలకవర్గ గౌడ కమిటీకి అదనంగా మరో ఆరుగురుతో కలిపి రేణుక ఎల్లమ్మ తల్లి గుడి కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఐదేళ్లకొకసారి జరిగే ఎల్లమ్మ ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు అందరి సహకారం కావాలని విజయవంతం చేయాలని అన్నారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, గౌడ సంఘ నాయకులు తెలిపారు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి గుడి కమిటీలో జనగాని సురేష్, గోడిశాల విజయ్ కుమార్, గోడిశాల నరేష్, కొత్తకొండ శ్రీకాంత్ జనగాని లక్ష్మీనారాయణ, శ్రీపతి బిక్షపతి, సోషల్ మీడియా ప్రతినిధిగా జనగాని ప్రవీణ్ గౌడ్, అర్జున్ ను ఎన్నుకున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గౌడ సంఘ కార్యదర్శి శ్రీపతి సదానందం, ఉపాధ్యక్షుడు గోడిశాల రాజేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోడిశాల రాజయ్య, డైరెక్టర్లు గొడిశాల సుమన్ గౌడ్, గొడిశాల విక్రమ్ గౌడ్, కందాల మొగిలి, కొత్తకొండ కుమార స్వామి, గొడిశాల సమ్మయ్య, బుర్ర రవి, జనగాని రాజు, గోడిశాల వినయ్, గోడిశాల ప్రదీప్, గోడిశాల రాజ్ కుమార్, వివేక్ శ్రీపతి సతీష్ కిషన్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply