Temple | మార్కండేయ శివాలయంలో….

Temple | మార్కండేయ శివాలయంలో….

Temple | అచ్చంపేట, ఆంధ్రప్రభ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అచ్చంపేట పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో విశేష ద్రవ్యములతో పాటు పవిత్ర నదీజలాలతో ఏకవార రుద్రాభిషేకం చేశారు. తదనంతరం కోట ప్రశాంతి కిషోర్, కర్నాటి నిర్మల నారాయణ దంపతుల ఆధ్వర్యంలో పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సోమవారం మధ్యాహ్నం 1 గంటలకు అమ్మవారి వడిబియ్యం పక్వం చేసి భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు వనం పర్వతాలు, చిలువేరు ధనరాజ్, కర్నాటి రాములు, కర్నాటి నారాయణ, వనం వేణు, గుజ్జరి నర్సింహ, మాకం మల్లయ్య, దాసుపత్రి శకుంతల, వనం గీతలు, గుర్రం హైమావతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply