Temple | రెండో రోజు ఘనంగా హోమ యజ్ఙాలు…

Temple | రెండో రోజు ఘనంగా హోమ యజ్ఙాలు…
- నర నారాయణస్వామి ఆలయ ప్రాంగణంలో కిక్కిరిసిన భక్తులు..
Temple | జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు గ్రామ సమీపాన ఉన్న శ్రీనరనారాయణస్వామి ఆలయ ప్రాంగణంలో రెండో రోజైన ఈ రోజు ఆలయ పురోహితుడు కాకెర రాజానరేంద్రశర్మ, రోటిగూడ గీత ధర్మ ప్రచారకుడు శ్రీహరిమౌన స్వామిలచే గీతాదేవి ప్రార్థనలు, శ్రీనరనారాయణస్వామి పూర్ణాభిషేకం, వీరాంజనేయ స్వామి అభిషేకం, శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి, సంపూర్ణ గీతాహవన యజ్ఞములు 141 జంటల దంపతులచే ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటి అధ్యక్షుడు యాదగిరి స్వదేశీరావ్, ఆ గ్రామ సర్పంచి బొంతల నాగమణి-మల్లేష్, గౌరవ అధ్యక్షుడు కాకెర నర్సయ్య, నిర్వాహకులు జొన్నల శంకర్, అంజాగౌడ్ కె.నర్సాగౌడ్, నాగేశ్వర్, విష్ణు, రంగయ్య, తదితరుల ఆధ్వర్యంలో ప్రశాంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు యాదగిరి స్వరూపరాణి- వెంకటమురళి మనోహర్ రావు దంపతులచే మధ్యాహ్నం అన్నదానం చేశారు. అనంతరం గ్రామ వివేకానంద ఇంగ్లీష్ మీడియం, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులచే సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ఎస్సై గొల్లపెల్లి అనూష ఆధ్వర్యంలో జాతరలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భక్తులతో పాటు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలలోని పలువురు భక్తులు విచ్చేసి మొక్కులు తీర్చుకున్నారు.
