వడదెబ్బ బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించాలి

వడదెబ్బ బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించాలి

108ఉమ్మడి జిల్లా మేనేజర్ సామ్రాట్

ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని 108,102 అంబులెన్స్ లను. 108 అదిలాబాద్ ఉమ్మడి జిల్లాప్రోగ్రామ్ మ్యానేజర్ బి. సమ్రాట్ ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ శేఖర్ లు గురువారం వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు 108 ఉద్యోగులతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ఉష్ణోగ్రత లు పెరుగుతున్న నేపథ్యం లో ఎవరు అయిన వ్యాధి గ్రస్తులు 108 కి కాల్ చేసిన వెంటనే స్పందించాలి అని, ఎండాకాలం ఉష్ణోగ్రతలు ముదురుతున్న నేపథ్యంలో వడ దెబ్బకు గురైన వారికి అధిక ఉష్ణోగ్రత ను తగ్గించే డ్రాగ్ చిల్లర్, ఐస్ ప్యాక్. ఓ ఆర్ ఎస్ ను అంబులెన్స్ లో అందుబాటు లోఉంచుకోవాలి అని సూచించారు.

తక్షనం ప్రథమ చికిత్స అందించి వారిని అంబులెన్స్ లో దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించాలి అని సూచించారు. తరువాత 108 సిబ్బంది తో సమావేశం అయ్యి 108,102 రికార్డు ను వైద్య పరికరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో 108 ఈఎంటి లు శంకర్, దత్తాత్రేయ. పైలెట్లు ప్రవీణ్ కుమార్. రవీందర్, 102 సిబ్బంది వెంకటేష్ పాల్గొన్నారు.

Leave a Reply