Temperature | ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోంది

Temperature | ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోంది

Temperature | రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాలుల హెచ్చరిక
ఉత్తరాంధ్రలో తీవ్ర ప్రభావం.. కోస్తా, రాయలసీమలో ఎండల తీవ్రత
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు
ప్రజలకు అప్రమత్తత సూచనలు జారీ

Temperature | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏపీ రాష్ట్రంలో ఎండలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. సోమవారం 51 మండలాల్లో తీవ్రమైన వడగాలులు, మరో 49 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండగా, కోస్తా మరియు రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముంది. ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతలు కూడా ఆందోళనకరంగా ఉన్నాయి. వైఎస్సార్ కడప జిల్లా పొట్టిపాడులో 43.8 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 43.1 డిగ్రీలు నమోదయ్యాయి. నంద్యాల రూరల్‌లో 42.9, అనంతపురం జిల్లా తెరన్నపల్లెలో 42.3, కర్నూలు జిల్లా గూడూరులో 42.1 డిగ్రీలు నమోదయ్యాయి.

అలాగే పల్నాడు జిల్లా దుర్గిలో 41.8, శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో 41.6, మార్కాపురం జిల్లా అనుమలపల్లి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కమ్మిపాడులో 41.2, పశ్చిమగోదావరి జిల్లా పోడూరులో 41.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లకుండా ఉండాలని సూచిస్తున్నారు.

Leave a Reply