ఘనంగా చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జయంతి

ఘనంగా చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జయంతి
తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు రూపొందించింది చార్లెస్ ఫిలిప్ బ్రౌన్
ఇన్ చార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: మొదటి సంపూర్ణ తెలుగు–ఇంగ్లీష్ నిఘంటువు (1852) రూపొందించింది చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (Charles Philip Brown) అని ఇన్ చార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ చిత్రపటానికి ఆయన పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఆంగ్లేయాధికారిగా మద్రాస్ సివిల్ సర్వీస్ (Madras Civil Service) లో పనిచేస్తూ, తెలుగు భాషపై అపారమైన ఆసక్తి పెంచుకొని జీవితాంతం తెలుగు సాహిత్య అభివృద్ధికి సేవ చేసినట్లు వివరించారు. తెలుగు భాషా వ్యాకరణం, పదకోశం, కవిత్వం, గ్రంథ సంపాదకత్వం వంటి రంగాలలో విశేష కృషి చేశారన్నారు.
తెలుగు నేర్చుకునే వారికి వ్యాకరణ గ్రంథాలు, పాఠ్య పుస్తకాలు చర్చించినట్లు చెప్పారు. నివాళులు అర్పించిన వారిలో డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, పర్యాటక అధికారి నారాయణరావు, కలెక్టరేట్ ఆయా విభాగాల పర్యవేక్షులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
