Telugu Cinema | విజయ్, విక్రమ్ కాంబో ఫిక్స్ అయ్యిందా..?

Telugu Cinema | విజయ్, విక్రమ్ కాంబో ఫిక్స్ అయ్యిందా..?

Telugu Cinema, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ.. ఒకప్పుడు వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించాడు. ఇప్పుడు వరుసగా ఫ్లాప్స్ ఇస్తున్నాడు. లైగర్ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఖుషీ సినిమా ఫరవాలేదు అనిపించింది. ఫ్యామిలీ స్టార్, కింగ్ డమ్ సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే.. కొత్తగా మరో సినిమాకి విజయ్ దేవరకొండ ఓకే చెప్పారని.. అది విక్రమ్ తో అంటూ ఫిల్మ్ నగర్ లో గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం ఇప్పుడు మరింతగా ఊపందుకుంది. మరి.. నిజంగానే విజయ్, విక్రమ్ కాంబో ఫిక్స్ అయ్యిందా..? అసలు ఈ ప్రాజెక్ట్ వెనుక ఏం జరిగింది..?

విక్రమ్ కె కుమార్.. ఇష్క్ సినిమాతో నితిన్ కు సరైన టైమ్ సరైన సక్సెస్ అందించారు. దీంతో ఏకంగా అక్కినేని ఫ్యామిలీ హీరోలతో సినిమా చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకున్నారు. అదే.. మనం. ఈ సినిమా అక్కినేని హీరోలకే కాదు.. తెలుగు సినిమా చరిత్రలోనే ఎప్పటికీ మరచిపోలేని సినిమాగా నిలిచింది. ఆతర్వాత 24, గ్యాంగ్ లీడర్, థ్యాంక్యూ సినిమాలు తెరకెక్కించారు. ఈ మధ్య కాలంలో నాగచైతన్యతో దూత అనే వెబ్ సిరీస్ చేయడం.. ఈ సిరీస్ కు కూడా ట్రెమండస్ రెస్పాన్స్ రావడం తెలిసిందే. దూత సినిమా తర్వాత విక్రమ్ కె కుమార్ కొన్ని ప్రాజెక్టులు అనుకున్నారు కానీ.. ఏది సెట్ కాలేదు.

ముఖ్యంగా నితిన్ తో సినిమా చేయాలి అనుకున్నారు. కథ రెడీ చేయడం.. నితిన్ ఓకే అనడం అంతా జరిగిపోయింది. ఇక అనౌన్స్ చేసి సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అనుకుంటుంటే.. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందనే వార్త బయటకు వచ్చింది. నితిన్ ఇటీవల నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. రాబిన్ హుడ్, తమ్ముడు.. ఈ రెండు సినిమాలు అయినా ఆడతాయి అనుకుంటే.. ఈ రెండు డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో నితిన్ తో అనుకున్న ప్రాజెక్టులు క్యాన్సిల్ అయ్యాయి. ఈ కారణం వలనే నితిన్, విక్రమ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందా..? వేరే కారణం ఏదైనా ఉందా..? అనేది బయటకు రాలేదు కానీ.. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అనేది మాత్రం నిజమే అని టాక్ వినిపిస్తోంది.

నితిన్ తో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో విక్రమ్ కె కుమార్ విజయ్ దేవరకొండకు కథ చెప్పాడట. ఈ కథ నచ్చి సినిమా చేయడానికి విజయ్ ఓకే చెప్పాడనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ కాంబోలో మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించేందుకు ప్లానింగ్ జరుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. హారర్, టైం ట్రావెల్, లవ్ స్టోరీస్ ఇలా సాలిడ్ సబ్జెక్ట్ తో.. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో.. సినిమాలు రూపొందించి ఆడియెన్స్ కి థ్రిల్ అందించిన విక్రమ్ కుమార్ ఈసారి సరికొత్త కథాంశంతో రాబోతున్నారని తెలిసింది. నిజంగానే ఈ కాంబో వేరే లెవల్లో ఉండబోతుందని టాక్. మరి.. విజయ్, విక్రమ్ కలిసి ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Leave a Reply