Telugu Cinema | బాలయ్య, నాగ్.. ఆ రికార్డ్ సాధించేనా..?

Telugu Cinema | బాలయ్య, నాగ్.. ఆ రికార్డ్ సాధించేనా..?
Telugu Cinema | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నట సింహం బాలయ్య ఇటీవల అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం మలినేని గోపీచంద్ తో.. భారీ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాను ఈ ఇయర్ దసరాకి రిలీజ్ చేయాలనేది ప్లాన్. ఇక టాలీవుడ్ (Tollywood) కింగ్ నాగార్జున 100వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను ఈ ఇయర్ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. బాలయ్య, నాగ్.. ఈ ఇద్దరి టార్గెట్ ఇప్పుడు ఇదే అంటూ ప్రచారం జరుగుతుంది. ఇంతకీ.. ఏంటా టార్గెట్…?

Telugu Cinema | కథలో మార్పులు చేర్పులు..
బాలయ్య.. మలినేని గోపీచంద్ ఇద్దరూ కలసి వీరసింహారెడ్డి (Veerasimhareddy) అనే సినిమా చేయడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడం తెలిసిందే. దీంతో ఇద్దరూ కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు. ఇటీవల ఈ క్రేజీ కాంబోలో మూవీని అనౌన్స్ చేశారు. భారీ హిస్టారికల్ మూవీ చేయాలి అనుకున్నారు. స్టోరీ రెడీ.. బాలయ్య విని ఓకే చెప్పడం కూడా జరిగింది. అయితే.. లాస్ట్ మినిట్ లో ఈ సినిమా కథ మార్చి.. మరో కథతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వర్క్ జరుగుతుంది. దసరాకి ఈ సినిమా రిలీజ్ చేయాలనేది టార్గెట్ అని టాక్ వినిపిస్తోంది.

Telugu Cinema | కింగ్ కెరీర్ లో మైల్ స్టోన్..
ఇక కింగ్ నాగార్జున కెరీర్ లో మైల్ స్టోన్ లా నిలిచే 100వ సినిమా చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున (Nagarjuna) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో సీనియర్ హీరోయిన్స్ టబు, అనుష్క నటిస్తున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది కానీ.. అఫిషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. లాస్ట్ ఇయర్ సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. సమ్మర్ లో ఈ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారని సమాచారం.

Telugu Cinema | 100 కోట్ల షేర్..
ఇక అసలు విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్.. ఈ ఇద్దరూ కూడా తమ సినిమాలతో 100 కోట్ల షేర్ సాధించారు. బాలయ్య, నాగ్ సినిమాలు మాత్రం 100 కోట్ల షేర్ సాధించలేదు. బాలయ్య నటించిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలు 100 కోట్ల షేర్ దగ్గరకు వచ్చి ఆగిపోయాయి. నాగార్జున నటించిన బ్రహ్మాస్త్ర, కుబేర, కూలీ సినిమాలు (Movies) 100 కోట్లకు పైగా షేర్ సాధించాయి కానీ.. నాగార్జున సోలో హీరోగా నటించిన సినిమాలు 100 కోట్లు షేర్ సాధించలేదు. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సినిమాలు 70 కోట్ల షేర్ వరకు రాబట్టాయి. అందుకనే.. ఇప్పుడు బాలయ్య, నాగ్ ఇద్దరి టార్గెట్.. 100 కోట్లు షేర్ రాబట్టడమని.. ప్రస్తుతం వీరిద్దరూ చేస్తున్న సినిమాలతో 100 కోట్లు షేర్ వసూలు చేసే ఛాన్స్ ఉందని టాక్. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.
