Telangana | అతడు లేడని.. ఆమె కూడా…

Telangana | అతడు లేడని.. ఆమె కూడా…

Telangana | ఆంధ్రప్రభ, వెబె డెస్క్ : ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో చోటుచేసుకుంది. ప్రేమజంట రాకేష్ రెడ్డి (25), హారిక (22) ఆత్మహత్యకు పాల్పడ్డారు.

రాకేష్ రెడ్డి, హారిక ఒకరినొకరు ప్రేమించి వివాహం చేసుకున్నారు. పెళ్లైన మూడు నెలల తరువాత స్వగ్రామానికి తిరిగి వచ్చినప్పటికీ, కులాలు వేరుకావడంతో రాకేష్ తల్లిదండ్రులు ఆ వివాహాన్ని అంగీకరించలేదు.

ఆత్మహత్యకు దారితీసిన సంఘటన..

ఇటీవల హారిక ఆత్మహత్యాయత్నం చేసిన తరువాత పోలీసులు రాకేష్ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ తర్వాత కూడా ఆలస్యం చేస్తున్నారని భావించిన రాకేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడి మరణం వార్త విన్న వెంటనే హారిక కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Leave a Reply