Telangana | హరీశ్‌రావుపై సీఎం రేవంత్ ఫైర్

Telangana | హరీశ్‌రావుపై సీఎం రేవంత్ ఫైర్
Telangana | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. ఉదయం పదిగంటలకు సమావేశాలు ప్రారంభమయ్యాయి. భూకబ్జాలు, ప్రభుత్వ విచారణలతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. ఆదివారం ఈ విషయంలో అధికార-విపక్షాల మధ్య మాటల యుద్థం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో హరీష్‌రావు ఫ్యామిలీ భూకబ్జా వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తూ మండిపడ్డారు.
మహబూబ్ నగర్లో హరీష్‌రావు తమ్ముడు, మామ హనుమంతరావు, బామ్మర్ది సుమన్‌లు ధరణి అడ్డుపెట్టుకుని ఓ ప్రైవేట్ కంపెనీని బెదిరించి వందల ఎకరాల భూమిని లాక్కోలేదా అని ప్రశ్నించారు. ఆయా భూములపై హరీష్‌రావు ఒకే చెబితే హౌస్ కమిటీ వేయిస్తామని వెల్లడించారు. హరీష్‌రావు నిజాయితీ పరుడైతే ఆ భూముల మీద హౌస్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్నారు. ఇసుక, భూదందాలు చేసి వేల కోట్లకు కేటీఆర్, హరీష్‌రావులు అధిపతులు అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పేరుతో బెదిరించి బాలానగర్‌లో వందల ఎకరాలను గుంజుకున్నారని అన్నారు. హరీష్‌రావు ఓకే అంటే ఆ భూముల మీద హౌస్ కమిటీ వేయిస్తామని తేల్చిచెప్పారు. కేసీఆర్ కుటుంబం కాళేశ్వరం కుంభకోణానికి పాల్పడిందని దేశ ప్రధాని, హోం మంత్రి స్వయంగా చెప్పారని వివరించారు.
