Telangana | ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆర్టీసీ జేఏసీ నాయకులు సమ్మె వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కాగా తమ డిమాండ్లు నెరవేర్చాలని, లేకుంటే ఈనెల 7 నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు దిగుతామని ఆర్టీసీజేఏసీ నాయకులు ప్రభుత్వానికి, యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మంగళవారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో చర్చలు జరిపిన జేఏసీ నాయకులు.. తమ డిమాండ్లకు ప్రభుత్వం సమ్మతించడంతో సమ్మె వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు.

Leave a Reply