Telangana | రిపబ్లిక్ డే వేడుకలు..

Telangana | రిపబ్లిక్ డే వేడుకలు..
Telangana, పెద్దపల్లి, ఆంధ్రప్రభ : గణతంత్ర దినోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు జాతీయ జెండాను ఎగురవేశారు. కాంగ్రెస్ నాయకులు, చిన్నారులతో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు.

