బందరులో ఘన స్వాగతం

(ఆంధ్రప్రభ, కృష్ణా ప్రతినిధి) : తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మంగళవారం కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ రామానగరం వచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్నేహితుడు కంఠంనేని వెంకట రంగయ్య బాబు (Kanthamneni Venkata Rangaiah Babu) మాతృమూర్తి, దివంగత కంఠంనేని బాబూ రాజేంద్ర ప్రసాద్ సతీమణి బసవ భారతి దేవి ప్రథమ వర్థంతి సందర్భంగా రామానగరం వచ్చారు. భారతీ దేవీ చిత్రపటానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మండలి బు ద్ధప్రసాద్ నివాళులర్పించారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రి చల్లపల్లి మండలం (Challapalli Mandal) లో పర్యటించడంతో ప్రత్యేకత సంతరించుకుంది. ఆయనను చూసేందుకు రామానగరం కదిలిపోయింది. తెలంగాణ రాష్ట్ర జలవనరులు, పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం హెలికాప్టర్ (Helicopter) లో మచిలీపట్నం నగరంలోని జాతీయ కళాశాలలోని హెలిప్యాడ్ చేరుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర జలవనరులు శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బందరువాసులు ఘన స్వాగతం పలికారు. అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ (Mandali Buddha Prasad), రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఓఏస్డీ ప్రకాష్, మచిలీపట్నం ఆర్డీవో స్వాతి, తహసీల్దార్ మధుసూదన్ రావు, మాజీ ఎంపీపీ లక్ష్మీపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు యార్లగడ్డ సోమశేఖర ప్రసాద్, లక్ష్మీపురం నీటి సంఘం అధ్యక్షులు గొర్రెపర్తి సుబ్బారావు, స్థానిక నాయకులు బోలెం సాయిబాబు పుష్పగుచ్చాలు, శాలువలతో మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు.

Leave a Reply