telangana | స్వగ్రామం పై మమకారం

telangana | స్వగ్రామం పై మమకారం
telangana | ఎండపల్లి, ఆంధ్రప్రభ : ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ దంపతులు చెన్న అరుణ–దుర్గాప్రసాద్(Aruna–Durga Prasad) బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ 10వ తరగతి విద్యార్థులకు ఆల్-ఇన్-వన్(All-in-One) పుస్తకాలు, స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.
విద్యార్థులు చదువులో ప్రతిభ కనబర్చి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్ష వ్యక్తం చేసిన దంపతులు గ్రామ అభివృద్ధికి, పాఠశాల కోసం అవసరమైన ఏ సహకారం కావాలన్నా అందించేందుకు సిద్ధమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల హెచ్ఎం మల్లికార్జున, జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం శ్రీనివాస్(ZPHS HM Srinivas), మాజీ ఉపసర్పంచ్ చెన్న కుమారస్వామి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు..
