తెలంగాణ రైతు సంఘం మహాసభల కరపత్రం విడుదల

దండేపల్లి, ఆంధ్రప్రభ ; ఈ నెల 23, 24, 25,న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగే తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడవ మహాసభలకు మండలం లోని రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి మహాసభలను విజయవంతం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కొండగుర్ల లింగన్న తెలిపారు. దండేపల్లి మండల రైతు సంఘం మండల కమిటీ సమావేశంన్ని శుక్రవారం మండలం లోని తాళ్లపేటలో నిర్వహిచారు.
ఈ సందర్భంగా స్థానిక రైతులతో కలిసి రాష్ట్ర మహాసభల కరపత్రాన్ని విడుదల చేసి,వారు మాట్లాడుతూ రైతాంగ సమస్యలు గిట్టుబాటు ధర, బీమా సౌకర్యం, బోనస్, రైతు భరోసా, రైతు బీమా, బ్యాంకు రుణాలపై మాట్లాడుతూ.. రైతుల పక్షాన నిరంతరం రైతు సంఘాలు పోరాడుతాయన్నారు. భవిష్యత్ లో కార్మిక, కర్షక ప్రజా పోరాటాలకు మద్దతుగా నిలిచి సమస్యలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తామన్నారు.
ఈ మహాసభల జయప్రధానికి ప్రముఖులు,మేధావులు,రైతు శ్రేయోభిలాషులు,మద్దతుగా భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమoలో ,రైతు సంఘము మండల కార్యదర్శి, మోడితే వెంకటేష్, సహాయ కార్యదర్శి,ఎర్రోజుల శ్రీను, మండల ఉపాధ్యక్షులు,బొమ్మిడి రాజన్న, మండల కమిటీ సభ్యులు బండారి సురేష్,మద్దికుంట లక్ష్మణ్, మోడితే, మహేందర్ లు పాల్గొన్నారు.
