Telangana | ప్రభుత్వ పాఠశాలల్లో సమాజ భాగస్వామ్యం అవసరం
Telangana | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల్లో సమాజ భాగస్వామ్యం అవసరమని మండల విద్యాధికారి రామ్మోహన్ రావు అన్నారు. ఈ రోజు మండలంలోని పడమటిగూడెం పాఠశాలలో జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రామ్మోహన రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్రామానికి చెందిన నాగిరెడ్డి సునీల్ రెడ్డి(Nagi Reddy Sunil Reddy) కూతురు నిత్యా రెడ్డి జన్మదినం సందర్భంగా విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగులను, స్వీట్లను పంచారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న జక్కుల ల్లయ్య, శ్రీశైలం, వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు విద్యార్థులకు ఇంటి వద్ద సమయం కేటాయించి వారి ఎదుగుదలను పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నివాస్, మురళీధర్, శేఖర్, తిరుపతయ్య, వెంకన్న తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు.

