టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన రేవంత్

భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్(Sarvepalli Radhakrishnan) జయంతి సందర్భంగా, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి(A. Revanth Reddy) ఉపాధ్యాయ దినోత్సవ(Teacher’s Day) శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపాధ్యాయులు తరగతి గదుల్లో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే మార్గదర్శకులుగా, సమాజానికి జ్ఞాన దీపాలను వెలిగించే గురువులుగా పనిచేస్తున్నారని కొనియాడారు.


గురువులు విద్యార్థులలో నైతిక విలువలు, నైపుణ్యాలు, సృజనాత్మకతను పెంపొందిస్తూ సమాజ పురోగతికి బాటలు వేస్తారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగంలో నాణ్యతా ప్రమాణాలను పెంచేందుకు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల( teachers)కు శిక్షణ, క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు. ఫేషియల్ రికగ్నిషన్ వంటి సాంకేతికతల ద్వారా హాజరు శాతం మెరుగుపరచడం, విద్యా సంస్థల్లో లోటుపాట్లను అరికట్టడం లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. గురువుల కృషి లేనిదే దేశాభివృద్ధి సాధ్యం కాదని, వారి సేవలను గౌరవిస్తూ, విద్యా రంగంలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply