Telangana | తాగునీటిలో మురుగు వాసన…బకెట్ నీటితో నిరసన

Telangana | తాగునీటిలో మురుగు వాసన…బకెట్ నీటితో నిరసన

మా సమస్యను పట్టించుకోండి అంటూ ఆవేదన
మున్సిపల్ కమిషనర్‌కు మూడు సార్లు దరఖాస్తులు ఇచ్చినా ఫలితం లేదు.
ఇప్పుడు పట్టించుకునే వారు లేరని బాధితుడి వేదన
అధికారి నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం
కొత్త కమిషనర్ వస్తేనే మున్సిపల్ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజల ఆశ

Telangana | స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ: స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపల్ పరిధిలో తాగునీటిలో మురుగు నీరు కలు స్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ బాధితుడు బకెట్‌లో నీటిని తీసుకు ని మున్సిపల్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా గాంధీ బొమ్మ సమీపంలోని 2–9/2 నెంబ ర్ గల ఇంటి ముందు నివసిస్తున్న వెలమజల వెంకట్ రెడ్డి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి సారు ఇటు చూడండి…ఈ నీళ్ల వాసన చూడండి అంటూ బకెట్‌లో తీసుకొచ్చిన తాగునీటిని అధికారులకు చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాగునీటిలో మురుగు నీరు కలుస్తోందని ఇప్ప టికే మున్సిపల్ కమిషనర్‌కు మూడుసార్లు దరఖాస్తులు ఇచ్చినా ఎలాం టి చర్యలు తీసుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎన్నికల సమయంలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పట్టిం చుకునే వారు లేరని మండిపడ్డాడు.

Telangana

మా సమస్యను పరిష్కారం చేయండి:

మా సమస్యను ఒక్కసారి చూసి పరిష్కారం చేయండి సారు అంటూ కలెక్టర్‌ను ఈ సందర్బంగా బాధితుడు కోరాడు. ప్రజలకు సరఫరా చేసే తాగునీరు ఇలా ఉండడం చాలా బాధాకరమని పేర్కొన్నాడు. ప్రాంతం లో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగు నీరు నిలిచిపోతూ అదే నీరు తాగునీటి పైపుల్లోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారని తెలిపారు.

Telangana

నూతన కమిషనర్ వస్తేనే పరిస్థితి మారే అవకాశం:

అధికారుల నిర్లక్ష్యంతో మున్సిపాలిటీలో సమస్యలు రోజురోజుకు పెరు గుతున్నాయి. ప్రస్తుతం మున్సిపాలిటీలో సమస్యలపై సరైన స్పందన లేదు. కొత్తగా ఏర్పడిన స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే నూతన కమిషనర్ వస్తేనే పరిస్థితి మారే అవకాశం ఉంద ని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Telangana

Leave a Reply