2manytimes |కత్తులతో పొడిచి పొడిచి

2manytimes | కత్తులతో పొడిచి పొడిచి…
2manytimes | అత్తాపూర్‌లో దారుణ హత్య – న్యాయవాది ఖదీర్ మృతి
ఆఫీసులోనే కత్తులతో దాడి చేసిన దుండగులు
పలుమార్లు పొడవడంతో అక్కడికక్కడే మృతి
కుటుంబ విభేదాలే కారణమా? పోలీసుల అనుమానం
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు – దర్యాప్తు ప్రారంభం
రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపిన ఘటన
2manytimes |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : న్యాయవాదిని కత్తులతో పొడిచి పొడిచి దారుణంగా హత్యచేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో చోటుచేసుకుంది. న్యాయవాది ఖదీర్‌ను దుండగులు హత్య చేసి పరారయ్యారు. సులేమాన్ నగర్‌లోని తన ఆఫీసులో ఉన్న ఖదీర్‌పై దుండగులు కత్తులతో దాడి చేశారు.

కత్తులతో పలుమార్లు పొడవడంతో అక్కడికక్కడే అతడు మృతిచెందాడు. ఖదీర్ మరణించినట్లు ధ్రువీకరించుకున్న దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ విభేదాల కారణంగా ఖదీర్ బావమరుదులే ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
