Tekumatla | మల్లయ్య మృతి సమాజానికి తీరని లోటు…

Tekumatla | మల్లయ్య మృతి సమాజానికి తీరని లోటు…
Tekumatla | టేకుమట్ల, ఆంధ్రప్రభ : సమ, సమాజ స్థాపన కోసం తాను నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు కష్టపడుతూ తుది శ్వాస విడిచే వరకు కమ్యూనిస్టు పార్టీలో కొనసాగిన ఓరగంటి మల్లయ్య మరణం కమ్యూనిస్టు పార్టీకి వారి కుటుంబానికి తీరని లోటని సిపిఎం ములుగు జిల్లా కార్యవర్గ సభ్యులు గుండెబోయిన రవి గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వెల్లంపల్లి గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకులు ఓరుగంటి మల్లయ్య గౌడ్ అనారోగ్యంతో మృతి చెందడంతో అయన పార్థివ దేహం పై ఎర్ర జెండా కప్పి నివాళులు అర్పించారు. అనంతరం సీపీఎం ములుగు జిల్లా కార్యవర్గ సభ్యుడు గుండెబోయిన రవిగౌడ్ మాట్లాడుతూ… ఓరుగంటి మల్లయ్య గౌడ్ ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకా నల్లబెల్లి మండలంలోని శనిగరం గ్రామంలో40 సంవత్సరాల క్రితం మాజీ ఎమ్మెల్యే ఒంకర్ ఆధ్వర్యంలో తునికాకు కూలి రేట్లకోసం అలాగే పార్టీ చేసిన అనేక పోరాటల్లో మల్లయ్య గౌడ్ కీలకంగా ప్రజల కోసం పని చేసే వారని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం పని చేస్తామని అన్నారు.
