ఆంధ్రప్రభ : ఎర్రటి పోస్టు బాక్సు చూస్తే ఒక ఎమోషన్.. ఎన్నో తరాల భావోద్వేగాలు ఆ పెట్టితో ముడిపడి ఉన్నాయి. తల్లితండ్రుల(parents) క్షేమ సమాచారాలు బిడ్డలకు తెలవాలన్నా, బిడ్డల ఆలనపాలన కూడా తల్లితండ్రులకు తెలవాలన్నా, మంచి చెడుల వార్తలు(News) ప్రజలకు చేరవేయాలన్నాఆ పెట్టే శరణ్యం(that refuge). స్నేహితలు, ప్రేమికులు, భార్యభర్తల(friends, lovers, spouses) మధ్య సమాచార వారధిగా ఆ పెట్టి అందించిన సేవలు ప్రతి భారతీయుడి( Indian)కి చిరస్మరణీయమే.
అంతగా భారతీయుల జీవితాల్లో 170 ఏళ్ల 11 నెలలుగా పెనవేసుకోపోయిన ఆ పెట్టి ఈ రోజు నుంచి కనిపించదు. ఇక సెలవు అంటూ ఆత్మీయ నేస్తమైన ఉత్తరాల డబ్బా(soulmate letter box) వెళ్లిపోతోంది! సాంకేతిక పరిజ్ఞానం(Technology) సహాయంతో సమాచార సాధనాలు ఇంతగా వాడుకలోకి రాకముందు సమాచార బట్వాడాకు భారతీయులకు ఉన్న ఏకైక సాధనం పోస్ట్ బాక్స్. ఇప్పుడు ఆ పోస్టుబాక్స్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కనుమరుగైపోతోంది.
సుమారు ఐదు లక్షల పోస్టు బాక్సులు ఇక దేశవ్యాప్తంగా మనకు కనిపించవు. మన దేశంలో పోస్టల్ వ్యవస్ధ 1854వ సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి మన తాత, ముత్తాలకు, తండ్రులకు అత్యంత విశ్వసనీయమైన సమాచార నెచ్చెలి పోస్ట్ డబ్బా. భారత దేశంలో ఏ మూలకు వెళ్లినా ఒక స్ధంభానికో, ఒక ఇంటి గోడకో, లేక పోస్టాఫీసుల ముందో నిగనిగలాడుతూ ఎర్రగా మెరిపోతూ కనిపించేది పోస్ట్ బాక్స్.
ఎన్నో కోట్ల మందికి నిత్యం సమాచార చేరవేసే పెట్టె(information delivery box)గా భారతీయ సమాజంలో అంతర్భాగం అయ్యింది. తన ద్వారా ఎంతో మందికి సంతోషలను పంచే కబుర్లు చేరవేసేది. ఎన్నో కుటుంబాల దుఖాలను పంచుకునేది, ఎందరో నిరుద్యోగ యువతకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు తనలో దాచుకుని చేరవేసేది. అటువంటి సంతోషాల మిత్రుడు, మన కుటుంబ సభ్యుడు లాంటి పోస్ట్ బాక్స్ ఇకపై మనకు ఎక్కడా కనిపించదు.
ఇదో అద్భుతమైన డబ్బా
ఈ పోస్టు డబ్బా ఏదో రేకు పెట్టెలా ఉండేది కాదు. చాలా బరువుగా మందమైన ఇనుముతో దీన్నిరూపొందించారు. ఈ పోస్ట్ బాక్స్‌ను వర్షాలు ఏమీ చేయలేవు. ఎంతటి ఈదురు గాలైనా ఈ ఎర్రపెట్టెను ఈంచు కూడా కదపలేదు. తుఫాను వచ్చినా డబ్బాలోకి చుక్క నీరు చేరదు. మనం డబ్బాలో వేసిన లెటర్లు, కవర్ల( letters, envelopes)ను వీటన్నింటి నుంచీ కాపాడి అంత్యం భద్రంగా తనలో దానలో దాచుకుని మనం రాసిన చిరునామాలకు సురక్షితంగా చేరుస్తుంది. ముప్పేట వర్షం కురుస్తున్నడబ్బాలో ఉన్నఒక్క లెటర్‌కి కూడా కనీసం చెమ్మ పట్టకుండా ఈ పోస్ట్ డబ్బాను ఎవరు సృష్టించారో కానీ వారికి చేతులెత్తి దండాలు పెట్టాలి.

