ఆకలి తీరుస్తూ.. ఆదర్శంగా నిలుస్తూ..

ఆకలి తీరుస్తూ.. ఆదర్శంగా నిలుస్తూ..
బెల్లంపల్లిలో 372వ వారమూ కొనసాగిన అన్నదానం
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : స్థానిక కాంటా చౌరస్తాలో అమ్మ ఒడి ఎన్జీవో ‘అన్నదాత ప్రాజెక్ట్’ , టెక్నో డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 2020 ఏప్రిల్ 5న ప్రారంభమైన ఈ సేవా కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతూ.. 372వ వారానికి చేరుకుంది. ఈ వారం అన్నదానాన్ని మందమర్రికి చెందిన దంగేటి నాగదుర్గ ప్రసాద్ జ్ఞాపకార్థంగా ఆయన మిత్రలు ముడుపు సాండి చారి అర్ష ప్రవీణ్, రెడ్డి రాజుల సాయి, కంది ప్రదీప్, బొజనపెళ్ళి రంజిత్, అకుల వాసు నాయుడు, తొట సురేందర్, దుమ్మని రాకేష్, చింతకింది కిట్టు, కాంపెల్లి శివకుమార్ లు నిర్వహించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సుమారు 200 మంది యాచకులు, అడ్డా కూలీలు, బాటసారుల ఆకలి తీర్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అజ్మీరా మోహన్, హనుమాండ్ల మధుకర్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా ప్రతి ఆదివారం నిర్విరామంగా అన్నదానం కొనసాగిస్తున్నామని, ఆకలితో ఉన్నవారి కడుపు నింపడంలోనే నిజమైన సంతృప్తి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాండ్ల సువర్ణ, తిరుమల చారి, రఘు, ఖదీర్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.
